జామ పండు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు జామ తోట ఎలా సాగు చేస్తారు:-
మనలో ప్రతి ఒక్కరం కనీసం ఒకసారయినా ప్లేట్ నిండా తియ్యని జామపండ్లపై ఉప్పు-కారం జల్లుకుని వాటిని మనసారా తినే ఉంటాము కొందరికి పచ్చి కాయలు నచ్చితే, మరి కొందరికి పండుపైనే మనసు ఉంటుంది అంతేకాకుండ జామ పండు తో పాటు జామ చెట్టు ఆకులు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. చాలా మంది లేత జామ ఆకులను చింతపండు తో కలిపి తింటారు, చాలా రుచిగా కూడా ఉంటుంది. జామ దాని రుచి మరియు సువాసనకు ప్రసిద్ధి చెందింది. అంతేగాక, ఈ జామ పండులో ఉన్న వివిధ ఆరోగ్య ప్రయోజనాల కారణంగా, జామ పండు కూడా సూపర్ ఫ్రూట్లలో ఒకటిగా పరిగణించబడింది.నిజానికి , జామ పండులో అత్యధికంగా ఉండే విటమిన్ సి మరియు ఖనిజాల కారణంగా దీన్ని ఉష్ణమండల ఆపిల్ పండుగా పరిగణించబడుతోంది.ప్రపంచంలోనే అతిపెద్ద జామాపండ్ల ఉత్పత్తిదారుగా భారత్ ఉంది, పండ్లలోనే జామ పండు మన ఆరోగ్యాన్ని కాపడటానికి ఎంతో ఉపయోగపడుతుందని హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ వారు పండ్ల మీద చేసిన రీసెర్చ్ లో తెలిసింది.జామ పండు ని ఇంగ్లీష్ లో గువవా(Guava) అని పిలుస్తారు . జామ పండు యొక్క శాస్త్రీయ నామం సిడియం గుజావ (Psidium guajava). ప్రపంచ వ్యాప్తంగా జామపండు యొక్క ఉత్పత్తి 55 నుండి 65 మిలియన్ టన్నులు అయితే ఇందులో 30 మిలియన్లు అంటే దాదాపు 47% కేవలం మన భారత దేశంలో ఉత్పత్తి చేయబడుతుంది ఈ సున్నితమైన పండు చర్మం యొక్క ఆరోగ్యానికి మరియు రోగనిరోధకతకు సహాయపడుతుంది, ఎందుకంటే దీనికో అస్కొర్బిక్ ఆమ్లం, లైకోపీన్ మరియు అనామ్లజనకాలు వంటివి సమృద్ధిగా ఉంటాయి. జామపండ్లు పోషకాలకు మరియు మాంగనీసుల గొప్ప నిలయం. దీనిలోని ఈ మాంగనీసు మనం తినే ఆహారం నుండి పొందే వివిధ కీలక పోషకాలను శరీరంలో కలిసిపోయేలా చేయడంలో సహాయపడుతుంది. జామపండులో ఫెలేట్ అనే ఖనిజం పుష్కలంగా ఉంటుంది, ఇది సంతానోత్పత్తిని ప్రోత్సహించే ఒక ఖనిజము. కనుక, లైంగికపరంగా జామవల్ల సిద్దించే ఆరోగ్యప్రయోజనాల్ని అందులోని ఫెలేట్ కారణంగానేనని చెప్పవచ్చు. ఇంకా, జామలో ఉన్న పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
జామ పండు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:-
*ముఖ్యముగా విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలం జామ పండు.మరియు జామ తక్కువ కేవరీలు మరియు కొవ్వుల్ని కల్గి ఉంటుంది ఈ పండు కరిగిపోయే ఆహార పీచుపదార్థానికిఓ గొప్ప నిలయం. మరియు మెగ్నీషియం, కాపర్ మరియు మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా జామపండులో గణనీయమైన మొత్తంలో ఉన్నాయి1. జామ పండు గుండె ఆరోగ్యానికి చాల సహాయపడుతుంది:-
* గుండెకు అత్యంత అనుకూలమైన ఆహారాలలో జామ కూడా ఒకటి. రక్తపోటు స్థాయిలను క్రమబద్ధీకరించడానికి ఇది సహాయపడుతుంది, అయితే జామ శరీరంలోని కొవ్వు (కొలెస్ట్రాల్) స్థాయిలను అదుపు చేయడంలో సహాయపడుతుంది, అందువలన హృదయకండరాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ ఇది సహాయకారి
*జామ పండు గుండె కండరాలపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండెను యవ్వనంగా ఉంచుతుంది మరియు జామ పండులో ఉండే ఫైబర్ మరియు పొటాషియం బ్లడ్ ప్రెషర్ ను తగ్గించటంలో దోహదపడుతుంది.
2.జామ పండు క్యాన్సర్ కి వ్యతిరేకంగా పని చేస్తుంది:-
* జామపండు రసం క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు నిరూపించబడింది మరియు ప్రతి రోజు 100 గ్రాముల జామ చెట్టు యొక్క ఆకుల డికాషన్ తాగటం వల్ల లంగ్ క్యాన్సర్ మరియు కడుపు కు సంబంచిన క్యాన్సర్ ల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది
*జామ పండు లో ఉండే అంటి యాక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో దోహదపడుతుంది మరియు వ్యాప్తికి సంబంధించిన కొన్ని సిగ్నలింగ్ మార్గాల్లో జామరసం అడ్డుపడి క్యాన్సర్ పెరుగుదలను తగ్గించవచ్చు, అని పేర్కొంది.
3.జామ పండు చర్మానికి సంబంచిన వివిధ సమస్యల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది:-
*జామ పండు ఆకులో ఉండే ఆంటీబాక్టీరియల్ గుణాల కారణంగా చర్మానికి సంబంచిన వివిధ సమస్యల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది కాబట్టి జామపండును తినడంవల్ల చర్మానికి అద్భుతాలే చేయగలదు.
*జామపండులో అనామ్లజనకాలు అధిక స్థాయిలో ఉన్నందున వృద్ధాప్య ప్రక్రియను తగ్గించడం మరియు చర్మం ముడుతల్ని తగ్గించడంతో పాటు చర్మానికి కాలిన గాయాలు లేదా కోసుకు పోవటం వల్ల కలిగే గాయాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల నుంచి కాపాడటంలో జామ పండు ఆకుల ఎక్స్ట్రాక్ట్ సహాయపడుతుంది
*అనేకమంది స్త్రీలు ముట్టు అయిన సమయంలో నొప్పి డిస్మెనోరియాని అనుభవిస్తారు జామపండు సారం యొక్క సేవనం ముట్టనొప్పి (dysmenorrhea)ని తగ్గించేందుకు దోహదపడుతుందని వైద్య అధ్యయనాలు సూచించాయి.
*పలు దేశాలలో జామ పండు, వీటి ఆకులను మరియు ఆకుల యొక్క డికాషన్ ను నొప్పి తో కూడిన పీరియడ్స్ ను తగ్గించటానికి వినియోగిస్తారు కాబట్టి ముట్టునొప్పికి జామ పండు ఓ మంచి మందులా పనిచేస్తుంది.
*జామపండు యొక్క ఆకుల యొక్క ఎక్స్ట్రాక్ట్ పీరియడ్స్ లో వచ్చే కడుపు నొప్పిని తగ్గించటంలో సహాయపడుతుంది పరిశోధనలో తెలిసినది
5.జామ పండు జీర్ణ వ్యవస్థకు సంబంచిన సమస్యల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది :-
*జామ పండు లోని ఔషధ గుణాల కారణంగా జీర్ణ వ్యవస్థ కు సంబంచిన ఇన్ఫెక్షన్స్ అయిన అజీర్ణం, విరేచనాలు, కడుపునొప్పి లాంటి సమస్యల కోసం సాంప్రదాయక చికిత్స గా వినియోగిస్తారు,ఇండియా లోని పలు ప్రాంతాలలో జామ చెట్టు యొక్క ఆకులను జీర్ణ వ్యవస్థకు సంభందించిన రోగాల కోసం వినియోగించటం జరుగుతుంది
జామ పండు వల్ల మరికొన్ని ప్రయోజనాలు :-
*జామ పండు కంటి యొక్క ఆరోగ్యానికి మేలు చేస్తుంది
*జామ పండు శరీరంలో షుగర్ లెవెల్స్ ను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది
*జామ పండ్ల యొక్క ఆకులు పంటి యొక్క నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది
జామ తోట ఎలా సాగు చేస్తారో తెలుసుకొందాము :-
మొదటగా జామ తోట కి అనువైన భూములు :-
1.ఎర్రనేలలు
2. నల్లరేగడి
3. రాళ్లబూములు
4. వీటికి తౌడు నేలలు పనికిరావు
1.తెల్ల కండ రకాలు 2.ఎర్రకండ రకాలు
1.తెల్ల కండ రకాలు:-
*అలహాబాద్ సఫేదా జామ : అలహాబాద్ సఫేదా అనేది మధ్యస్థ పరిమాణం, గుండ్రని పండ్లు, కండ తెల్లగా మరియు మంచి నాణ్యత కల్లి ఉంటుంది. అలహాబాద్ సఫేదా విత్తనాలు చిన్నవిగా, మెత్తగా వుంటాయి. ప్రతి ఎకరాకు సంవత్సరానికి దిగుబడి 50-70 క్వింటాళ్ళు వచ్చే అవకాశము ఉంటుంది
*లక్నో-49 (సర్గార్) జామ : పండ్లు కోలగా మరియు పెద్ద పరిమాణంలో గరుకు చర్మంతో వుంటాయి. విత్తనాలు పెద్దవిగా మరియు గట్టిగా వుంటాయి. ఎకరాకు సంవత్సరానికి దిగుబడి 50-70 క్వింటాళ్ళు వచ్చే అవకాశము ఉంటుంది
*సఫేద్ జామ (అలహాబాద్ సఫేదా X కొహిర్ సెలక్షన్) జామ : సఫేద్ జామ పండ్లు మధ్యస్థంగా, గుండ్రంగా, పలుచటి తోలుతో చాల రుచిగా వుంటాయి. ఎకరాకు సంవత్సరానికి దిగుబది 70-90 క్వింటాళ్ళు వచ్చే అవకాశము ఉంటుంది
*కొహిర్ సఫేదా (కొహిర్ సెలక్షన్ X అలహాబాద్ సఫేదా) జామ : ఈ జామ అత్యధిక దిగుబడి నిస్తుంది. పండ్లు పెద్దగా, గింజలు కొంచెం గట్టిగా వుంటాయి.
*అర్క మృదుల : అలహాబాద్ సఫేద్నుంచి ఎన్నుకోబడిన మరో రకం ఇది పండ్లు గుండ్రంగా, పెద్దవిగా, గింజలు మొత్తగా ఉండి, కండ తెలుపు రంగులో తియ్యగా ఉండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశము ఉంటుంది.
*అర్క అమూల్య(సీడ్ లెస్ జామ X ఆలహాబాద్ సఫేదా) జామ : అర్క అమూల్య జామ కాయలు కూడా మధ్యస్థంగా, తెల్లకండతో తియ్యగా వుంటాయి. విత్తనాలు మొత్తగా వుంటాయి. ఎక్కువ రోజులు నిల్వ వుంటాయి.
*శ్వేత జామ :శ్వేత జామ అనేది అధిక దిగుబడి నిచ్చే తెలుపు కండ రకం. పండు సుమారు 220 గ్రాముల బరువుతో తెలుపు రంగుతో ఎరుపు మచ్చలు కలిగి ఉంటుంది. గింజలు మృదువుగా వుండి, నాటిన ఆరవ సంవత్సరంలో సుమారు 120 కిలోల దిగుబడి నిస్తుంది.
2.ఎర్రకండ రకాలు:-
ఎఱ్ఱని గుజ్జు జామపండ్లు గుజు పరిశ్రమలో వాడకంలో ఎక్కువగా వున్నది.
రెడ్ప్లష్ జామ :రెడ్ప్లష్ జామ కాయలు ముదురు ఆకుపచ్చ రంగుతో గరుకుగా ఉండి, గింజలు గట్టిగా ఉండి, కండ ఎరుపు రంగులో ఉంటుంది. ఎకరాకు సంవత్సరానికి దిగుబది 60-70 క్వింటాళ్ళు వచ్చే అవకాశము వున్నది
లలిత్ జామ : లలిత్ జామ ని అలహాబాద్ సఫేదతో పోలిస్తే 23% దిగుబడి ఎక్కువ నిస్తుంది. పండు బరువు 180గ్రా. నుండి 190గ్రా. ఉండి నిల్వ పదార్గాల తయారీకి అనువైన ఎరుపు కండ రకం.
కిరణ్ : (కంసారిXపర్పల్ లోకల్) జామ :కిరణ్ జామ ఐ.ఐ.హెచ్.ఆర్. బెంగుళూరు నుండి ఈ మధ్యనే విడుదలైన రకం. పండు ఎరుపు కండతో మృదువైన గింజలున్న రకం. లైకోపిన్ అధికంగా ఉంటుంది. జామ పల్స్ తయారీకి అనువైనది.
*జింక్ లోపం వల్ల ఈనెల మధ్య పత్రహరితం కోల్పోయినట్లు కనపడి, ఆకులు మరీ చిన్నవిగా ఉంటాయి
*మెగ్నీషియం లోపం అనేది నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పంట తొలిదశలో ఆకులు రంగు కోల్పోయి, వాలిపోయి ఉంటాయి. వేసవికాలంలో ఆకులు ఎరుపు రంగుకు మారుతాయి
పురుగులు:-
*పండు ఈగ
*కాండం తొలిచే పరుగు
*తెల్లసుడి దోమ
*పిండినల్లి
తెగుళ్ళు రకాలు :-
*ఎండుతెగులు
*అంత్రక్నోస్ లేక క్షీణింపు మరియు కాయకుళ్ళు
గమనిక :మా vjyreview అనేది జామ తోట రైతుల యొక్క అభిప్రాయాలూ తెల్సుకోని మీకు తెలియజేస్తున్నాము మీరు ఎవరు ఐనా జామ తోట పెట్టాలనుకుంటే మీ దగ్గర లో ఉన్న అగ్రికల్టెర్ ఆఫీసర్ యొక్క సలహాలు తీసుకోన తరువాత తోట పెట్టుకో గలరని మా యొక్క అభిప్రాయము




Comments
Post a Comment