మామిడి పండ్లు చేసే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ కోసం :-
హాయ్ ఫ్రెండ్స్ వేసవి కాలం వచ్చినది అంటే మనకి గుర్తువచ్చేది మామిడి పండు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా ఇష్టపడనివాళు అంటూ ఎవరు ఉండరు అలాంటి మామిడి పండు కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉంది. మామిడి ఆకులని మనము ఏదైనా కార్యము,పండుగలు వచ్చినపుడు మన ఇంటి గుమాలకి కట్టడము చుసే ఉంటారు ,ఇది భారతదేశపు జాతీయ ఫలం,వీటి కాయలను పచ్చడి తయారీలో ఉపయోగిస్తారు ఇందులో కెరోటిన్, విటమిన్ సి, కాల్షియం ఎక్కువ ,వీటి ఆకులను "చూత పత్రి" అని కూడా అంటారు ఈ చెట్టు మహావృక్షంగా పెరుగుతుంది. భారతదేశంలో వంద రకాలకుపైగా మామిడిపళ్ళు దొరుకుతాయి.ముందు గా మామిడి పండు తినడం వచ్చే ప్రయోజనాలు తెల్సుకొని తరువాత మామిడి తోట ని ఎలా సాగుచేస్తరో తెలుసుకుందాము
మామిడి పండ్లు చేసే ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు:-
1.మామిడి పండ్లలో ఉండే పొటాషియం మరియు మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. విటమిన్ సి మరియు ఫైబర్ శరీరంలో హాని చేసే కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.
2.మామిడి పండ్లలో క్వెర్సెటిన్, ఫిసెటిన్, ఐసోక్వెర్‌సిట్రిన్, ఆస్ట్రాగాలిన్, గాలిక్ యాసిడ్, మిథైల్ గాలేట్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ లుకేమియా వంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి.
3.చర్మంపై ముడతలు, నల్ల మచ్చలను తొలగించడానికి మామిడి పండ్లు ఉపయోగపడతాయి.
4.మామిడి పండ్లలో ఉండే విటమిన్ B6 చర్మంలోని సెబమ్‌ను తగ్గిస్తుంది.
5.మామిడి పండ్లలోని పొటాషియం చర్మానికి తేమ అందిస్తుంది.
6.మామిడి పండ్లలోని మెగ్నీషియం మొటిమలు, చర్మం జిడ్డును తగ్గిస్తుంది.
7.జీర్ణ సంబంధిత సమస్యలను మామిడి పండ్లు దూరం చేస్తాయి.
8.మీకు పంటి సమస్యలు ఉంటే తప్పకుండా మామిడి పండును తినండి. చిగుళ్ల నుంచి రక్తం కారడం, బ్యాక్టీరియ వంటి సమస్యల తొలగిపోతాయి.
9.మామిడి పండ్లు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది
10.మామిడి పండ్లలో వుండే విటమిన్లు మరియు ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతుంది. వృద్దాప్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది.
మామిడి పండ్లను తింటే గడ్డలు వస్తాయని, వేడి చేస్తాయని చాలామంది భయపడతారు. అయితే, వాటి కోసం మీరు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మామిడి పండ్లను అదేపనిగా అతిగా తినేవారికి మాత్రమే ఆ సమస్యలు వస్తాయి. రోజుకు ఒకటి లేదా రెండు కాయలు చొప్పున తినేవారికి ఎలాంటి సమస్య ఉండదు.
మామిడి తోట ని ఎలా సాగుచేస్తరో తెలుసుకుందామా:-
మామిడి చెట్టు. తొంభై (80) నుండి నూట ఇరవై (110) అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ముప్పై (25) అడుగుల వ్యాసం వరకు విస్తరించి కిరీటం ఆకారంలో ఉంటుంది వీటి ఆకులు పది (9) నుండి (34) సెంటి మీటర్ల పొడవు ఆరు (5) నుండి పది (9) సెంటి మీటర్ల వెడల్పు ఉండి ఎప్పడూ పచ్చగా ఉంటాయి. చిగుళ్లు లేత పసుపు రంగు నుండి ముదురు కాఫీ రంగుకు మారి చివరిగా ముదురు ఆకుపచ్చ రంగుకి వస్తాయి.
మామిడి పండ్లను అదేపనిగా అతిగా తినేవారికి వచ్చే దుష్ప్రభావాలు :-
మామిడి తోటకి అనుకూలించే నేలలు :-
1.ఎర్రనేలలు
2. నల్లరేగడి
3. రాళ్లబూములు
4. వీటికి తౌడు నేలలు పనికిరావు
మామిడి తోట రకాలు :-
బంగినపల్లి ,కోతమామిడి ,నీలం,చందూరా,రుమానియా,మల్గోవా,చక్కెర కట్టి,గిర్ కేసర్ మామిడి,బెంగుళూరు మామిడి.,రసాలు.,చిన్న రసాలు,పెద్ద రసాలు,చెరుకు రసాలు,షోలాపూరి,అల్ఫాన్సా,నూజివీడు రసం,పంచదార కలశ,కోలంగోవా,ఏండ్రాసు.. ఇలా చెప్పుకొంటే పొతే చాలా రకాలు ఉన్నాయి
మామిడి తోట జాగ్రతలు :
1. మామిడి మొక్కని ఎంచుకొనేటప్పుడు మార్కెట్ లో ఏ మొక్కకి ఎక్కువ డిమాండ్ ఉందొ ఆ రకము మొక్కలని ఎంచుకోవాలి
2.మామిడి చేట్లు ని 4 ఫీట్ లా నుండి 8 ఫీట్ లా గుంతలు తోవి పెట్టాలి ,మరియు చెట్టు కీ చెట్టు మధ్యన దూరం 10 ఫీట్ నుండి 15 ఫీట్ ఉండేటట్లు చూసుకోవాలి
3. ఇవి ఎకరానికి 60 నుండి 100 చెట్లూ వారికి పడుతాయి
4. వీటికి వాటర్ ఎక్కువగా వుండేటట్టు చూసుకోవాలి
5. డ్రిపు సిస్టమ్ ని ఉండేటట్లు చూసుకోవాలి
6. తోట చుటూ ఇనుప కాంచని ఉండేటట్లు చూసుకోవాలి
మామిడి తోట కి వచ్చే రోగాలు :-
ఇనుము ధాతు లోపం :-ఈ లోపము వల్ల ఆకులు తెల్లగా మారతాయి. ప రిమాణం తగ్గుతుంది. ఈ లోపం మరింత ఎక్కువగా ఉంటే కొనల నుంచి ఆకులు ఎండిపోతాయి. ఇనుము ధాతు సున్నం శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో సాగు చేసిన తోటల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ చెట్లలో పెరుగుదల కాపు కూడా సరిగా ఉండదు. ఒక్కోసారిగ చెట్లు ఎండిపోతాయి.
జింకు లోపం ; ఈ లోపం వల్ల ఆకులు చిన్నవిగా, సన్నగా , అంచులు లోపలికి ముడుచుకుపోతాయి. ఈనెల మధ్యభాగం పాలిపోయి పచ్చగా మారతాయి. చెట్లలో పెరుగుదల ఉండదు. కాపు, కాయ పరిమాణం, నాణ్యత తగ్గుతాయి.
బోరాన్ లోపం ; ఈ లోపం ఏర్పడితే ఆకులు పాలిపోయినట్లుగా కనిపిస్తాయి. కాపు దశలో కాయల్లో పగుళ్లు ఏర్పడతాయి. కాయలోపల కండ గోధుమ రంగుకు మారుతుంది..
మామిడి తోట కి వచ్చే రోగాలు నివారణకు :-
ఇనుము ధాతు లోపం:-ఈ లోపం నివారణకు లీటరు నీటికి 5గ్రా , అన్నభేది, గ్రాము నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు చెట్టు మొత్తం తడిచేలా పిచికారి చేయాలి.
జింకు లోపం :-ఈ లోపం నివారణకు లీటరు నీటికి 5గ్రా జింక్ సల్ఫేటుతోపాటు, 10గ్రా యూరియా కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
బోరాన్ లోపం:- -ఈ లోపం నివారణకు లీటరు నీటికి గ్రాము బోరాక్స్ కలిపిన ద్రావణాన్ని చెట్టు పూర్తిగా తడిసేలా పిచికారి చెయ్యాలి. జులై, ఆగస్టు నెలల్లో ఎరువులు వేసే సమయంలో ఒక్కో చెట్టుకు 100గ్రా బోరాక్స్ లేదా బోరిక్ అమ్లం వేయాలి.
మామిడి తోట కి వాతావరణం వల్ల రైతు కి వచ్చే నష్టాలు :-
ముఖ్యముగా మామిడి తోట వాతావరణం సరిగా లేకపోవడము వల్ల రైతులు ఎక్కువుగా నష్టపోతారు అందుకే ప్రతి యేటా మామిడి పండు దిగుబడి తగిపోతున్నది మామిడి తోట అనేది వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది . మామిడి కాయలు కోసే టైమ్ కీ గాలి ఎక్కువగా రావడం కాయలు రాలి క్రిందపడడము వల్ల నష్టపోతారు .
1. జనవరి నుంచి ఫిబ్రవరి దాకా పగలు 29 -31 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే మామిడి పూత నిలబడి పిందెలు ఎక్కువగా ఏర్పడతాయి. కానీ ఆ సమయంలో పగటి ఉష్ణోగ్రత 35-38 డిగ్రీల మధ్య నమోదవడం కావడం వల్ల పూత ఎండి రాలిపోతాయి . చలికాలంలో భారీవర్షాలు కురవడం, రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడం ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరగడం, మార్చిలో గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డుస్థాయిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం మామిడి పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి .
2. ఈ వాతావరణ మార్పుల వల్ల బూడిద తెగులు, తేనేమంచు పురుగు అధికంగా సోకి తోటలను దెబ్బతీశాయి
గమనిక :మా vjyreview అనేది మామిడి తోట రైతుల యొక్క అభిప్రాయాలూ తెల్సుకోని మీకు తెలియజేస్తున్నాము మీరు ఎవరు ఐనా మామిడి తోట పెట్టాలనుకుంటే మీ దగ్గర లో ఉన్న అగ్రికల్టెర్ ఆఫీసర్ యొక్క సలహాలు తీసుకోన తరువాత తోట పెట్టుకో గలరని మా యొక్క అభిప్రాయము



Comments
Post a Comment