నాటుకోళ్ల పెంపకం మరియు జాగ్రత్తలు:-
నాటుకోళ్ల పెంపకానికి షెడ్ నిర్మాణం:-
1.షెడ్డు నిర్మిస్తున్న ప్రదేశం కొంత ఎత్తులో ఉండునట్లు చూసుకోవాలి లేనియెడల వర్షాకాలంలో నీరు నిల్వ ఉంది అనేక వ్యాధులకు కారణమవుతాయి
2.కోళ్ల షెడ్డును తూర్పు పడమరల నిర్మిస్తే సూర్య కిరణాలు నేరుగా షెడ్లో పడకుండా ఉండి ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. పైగా గాలి వెలుతురు సక్రమంగా అందుతుంది.
3.షెడ్డు పక్కగోడలు 1 అడుగు ఎత్తు ఉండి 7 అడుగుల ఎత్తు వరకు ఇనుప వైర్ మెష్ అమర్చాలి. దానికి నైలాన్ వలన మార్చడం వల్ల దోమలు, పాములు వంటివి లోపలికి రాకుండా కాపాడుకోవచ్చు.
4. కోళ్ల షెడ్డు చుట్టూ అనవసరపు చెత్తను తొలగించి నీడనిచ్చే చెట్లను పెంచాలి.
మొద్ద టగా నాటుకోళ్ల పెంపకంలో నాణ్యమైన నాటు కోడిపిల్లల ఎంపిక:-
1.నాటు కోడి పిల్లలను ఎక్కువ మొత్తంలో పెంచాలి అనుకున్నప్పుడు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి
2.చిన్న పిల్లల పెంపకంలో మొదటి 6 వారాలు చాలా కీలకమైనది. ఈ సమయంలో కోడి పిల్ల శరీర ఉష్ణోగ్రతను తనకు తానుగా నియంత్రించుకోలేదు కావున తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
నాటుకోళ్ల పెంపకంలో దాణా :-
1.నాటు కోళ్లకు ప్రత్యేకమైన దాణా ఇవ్వవలసిన అవసరం లేదు
2.కోడి పిల్ల తొలి దశలో పొడి లేదా నూక రూపంలో ఉండే మేతనే దాణాగా ఇవ్వాలి.తర్వాత వయస్సు, ఎదుగుదలకు అనుగుణంగా పోషక విలువలు గల దాణాను అందించాలి
3.దాణా మరియు నీటి పాత్రల మధ్య ఎక్కువ దూరం ఉండకుండా చూసుకోవాలి దాంతో దాన వేస్టేజ్ నీ అరికట్టవచ్చు.
4.అయితే పెట్టలు గ్రుడ్లు పెట్టే సమయములో రోజుకు ఒక్కొక్క పెట్టకు 3 గ్రాముల పొడిసున్నం గాని, అలిచిప్పల పొడి గానీ, పొడి చేసిన కోడి గ్రుడ్డు పెంకును గాని, ఇతర కాల్షియం లవణాలను అందించి నట్లైయితే పెట్టలు తోలు గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు.
.నాటుకోళ్ల పెంపకంలో నీటి వసతులూ :-
1.షెడ్డులో మొదటి ఆరు వారాలు ప్రతి 50 కోడి పిల్లలకు ఒక నీటి తొట్టి చొప్పున 15 రోజుల వరకు నీరందించాలి
2.వయస్సు పెరిగే కొద్ది సరిపోయేన్ని నీటి పాత్రలను కోళ్ళకు ఏర్పాటు చేసి ఇ శుభ్రమైన నీటిని రోజుకు రెండు నుంచి మూడుసార్లు అందించాలి, వేసవికాలంలో అవసరాన్ని బట్టి వీలైనన్ని సార్లు అందిస్తే మంచిది.
నాటుకోళ్ల పెంపకంలో పాటించాల్సిన రోగనిరోధక టీకాలు:-
1.నాటు కోళ్లకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.అయితే మనం వ్యాపార శైలిలో పెంచుకోవడం వల్ల ముందు జాగ్రత్తగా కోళ్లకు సీజనల్గా వచ్చే వ్యాధులకు టీకాలు వేయించడం మంచిది. లేదంటే భారీగా ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది
2.వ్యాధులు సోకకుండా తగిన టీకాలు ముందే వేయించి,వ్యాధి నివారణ చర్యలు
3.కోడి పిల్లలకు మారెక్స్ వ్యాధి టీకాను మొదటి రోజు చర్మం క్రింద వేయించాలి. కోళ్లకు కొక్కెర తెగులు సోకకుండా టీకలు 7వ, 28 వ రోజు, 9, 18,41, 56 వ వారాల్లో టీకా ఇవ్వాలి
4.నాటు కోళ్ల లో ఎక్కువ గా కనిపించి పెల్లు, గోమారిని నివారించడానికి బ్యూటాక్స్ మందును నీళ్లలో కలిపి షెడ్‌లల్లో పిచికారి చేయాలి.
5.అలాగే 15వ, 21వ రోజుల్లో గంబోర వ్యాధి టీకాలు వేయించడం మంచిది.
6. కోళ్ళు ఎక్కువగా సూక్ష్మజీవుల వలన వ్యాధిగ్రస్తం చెందే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించడానికి పైపరిజిన్ మందును ఒక చెందాడు చొప్పున అర లీటరు నీళ్ళలో కలిపి ఒక్కొక్క కోడికి 5-10 మి.లీ. త్రాగించాలి
నాటుకోళ్ల పెంపకంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:-
1.సాధారణంగా వేసవికాలంలో కోళ్ళు అధిక వేడిమి కారణంగా తక్కువ మేత తింటాయి.
2.మేతలో అదనంగా విటమిన్-సి కలిపి ఇవ్వటం ద్వారా వేడి ఒత్తిడి వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చు
4.కోళ్ళను పట్టుకోవటం,పరీక్షించడటం లాంటి పనులు చల్లగా వుండే వేళల్లో చెయ్యాలి
5.వేసవికాలంలో కోళ్లకు ఎల్లప్పుడు చల్లటి నీటిని అందించాలి. దీనికి నీళ్ళ ట్యాంక్ పైన పందిరి లాంటిది లేదా ట్యాంక్ కి తెల్లరంగు వేస్తే, నీళ్ళు చల్లగా ఉంటాయి.
6. కోళ్ల షెడ్డు లో అధిక వేడిని నియంత్రించడానికి షెడ్ పైకప్పు పైన వరిగడ్డి లేదా చొప్పలాంటిది కప్పాలి.
7.షెడ్ చుట్టు ప్రక్కల నీడనిచ్చే చెట్లను పెంచడం వల్ల కోళ్లను అధిక వేడి నుంచి రక్షించవచ్చు.
8.త్రాగే నీటిని మాత్రం రోజంతా అందుబాటులో ఉంచాలి
గమనిక:-
నాటు కోళ్ల పెంపకం ఎంతో సులభమైన వృత్తి అయినప్పటికీ తగిన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడే రైతు సోదరులకు సమృద్ధిగా దాని ఫలాలు అందుతాయి. కావున నాటు కోళ్ల పెంపకం ప్రారంభించాలి అనుకున్నవారు కోళ్ల పెంపకంపై తగిన శిక్షణ తీసుకొని అనువైన యాజమాన్య పద్ధతులు పాటించడం ఎంతో ముఖ్యం.

Comments
Post a Comment