టర్కీ కోళ్ల పెంపకం :- భారతదేశంలో టర్కీల జాతులు:- 1. బ్రాడ్ బ్రెస్ట్ కాంస్య *ప్రాథమిక ఈకలు రంగు నలుపు మరియు కాంస్య కాదు. ఆడవారికి తెల్లటి చిట్కాలతో నల్లటి ఈకలు ఉంటాయి * ఇవి 12 వారాల వయస్సులోనే లింగ నిర్ధారణలో సహాయపడతాయి. 2.beltsville చిన్న తెలుపు *ఇది రంగు మరియు ఆకారంలో బోర్డ్ బ్రెస్ట్ వైట్‌ను పోలి ఉంటుంది కానీ పరిమాణంలో చిన్నది. గుడ్డు ఉత్పత్తి, సంతానోత్పత్తి మరియు పొదిగే అవకాశం ఉంటుంది. రైతు పేరు -ప్రమోద్ రెడ్డి చిరునామా - మునుగోడు మండలం చల్మెడ గ్రామం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర మొబైల్ నెంబర్ -9391253627 3. బ్రాడ్ బ్రెస్ట్ వైట్ ఇది బోర్డ్ బ్రెస్ట్డ్ కాంస్య మరియు తెల్లటి ఈకలతో కూడిన వైట్ హాలండ్ మధ్య క్రాస్. తెల్లటి ప్లూమేజ్ టర్కీలు భారతీయ-వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనవిగా అనిపిస్తాయి ఇవి మంచి వేడిని తట్టుకోగలవు మరియు డ్రెస్సింగ్ తర్వాత మంచిగా మరియు శుభ్రంగా కనిపిస్తాయి. 4. నందనం టర్కీ:- ఇ రకం బ్లాక్ దేశీ రకం మరియు అన్యదేశ బెల్ట్స్‌విల్లే చిన్న తెలుపు రకం మధ్య సంకలనం. ఇవి తమిళనాడు వాతావరణ పరిస్థితులకు అనుకూలం టర్కీలను ఫ్రీ రేం...
కోళ్ళ పెంపకం స్టార్ట్ చేయాలి అనుకొంటున్నారా:-
హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజులో ఎవరైనా బంధువులు వచ్చారంటే తపనిసారిగా కోడి మాంసము తేవడం అది మన ఇండియా లో అలాంటి కోళ్ల పెంపకం మన ఇండియాలో వివిద రకాలుగా పెంచుతున్నారు . దేశంలో వ్యవసాయం ప్రాముఖ్యత ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ, ఎప్పటికీ తొలి స్థానంలోనే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆహారోత్పత్తితోపాటు, పౌల్ట్రీ కూడా క్రమేణా ప్రాముఖ్యత సంతరించుకుంటూ వస్తోంది. గత నాలుగైదు దశాబ్దాల నుండి చూస్తే... భారతదేశ పౌల్ట్రీ రంగం చాలా మారిపోయింది. పాత తరం పౌల్ట్రీ వ్యవసాయం నుండి అత్యాధునిక పద్ధతుల్లోకి వచ్చేశారు. అలాగే 40 లక్షలమంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు ఈ మొత్తం వ్యాపారం రూ. 50,000 కోట్లు గా లెక్కించారు.ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న మాసంలో 38 శాతం గ్రామీణ, కొండ ప్రాంతాల నుండే వస్తోంది ,ఇలాంటి పౌల్ట్రీ మీరు పెట్టాలి అనుకొంటే,మీ వద్ద రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు డబ్బులు ఉంటే 10000 వేల కోళ్ల ను పెంచే షెడ్ నిర్మాణానికి ఖర్చు అవుతుంది
1. షెడ్ నిర్మిచిన తరువాత రైతులు పెద్ద పెద్ద ప్రైవేటు కంపెనీలకు కాంట్రాక్టు పద్ధతి మీద సరఫరా చేస్తూ ఉంటారు.అంటే ప్రైవేటు కంపెనీలు షెడ్ సామర్థ్యం బట్టీ కోళ్ల ను 45 days వరకూ ఒకటిన్నర నుండి రెండు కి.గ్రా. బరువు వచ్చేటట్టు పెంచమని కాంట్రాక్టు పద్ధతి ద్వరా రైతులకు సరఫరా చేస్తూ ఉంటారు అందుచేత కోళ్ళ రైతులకు మార్కెటింగ్ సమస్య కాబోదు.గమనిక కోళ్ల ను తీసుకొనేటపుడు ప్రైవేటు కంపెనీలు ఎటువంటి డబ్బు తీసుకోరు
2.కానీ రైతులు మా దగ్గర ఇన్ని కోళ్లను తీసుకున్నారు అని ప్రైవేటు కంపెనీ వాలు రైతులు దగర ఒక అగ్రిమెంట్ మీద సంతకము తీసుకొంటారు
3. ఇంకా ప్రైవేటు కంపెనీ వాలె మందులు ,ఆహారం సప్లై చేస్తారు
4. కంపెనీ నుండి ప్రతిరోజూ ఒక supervisor వచ్చి కోళ్ల ను గమినిస్టు ఉంటారు వారే కోళ్ల కి ఎపుడు మందులు ఇవ్వాలని చెపుతారు
5. ఇందులో రైతులు కి అయే ఖర్చు కరెంటు ,వాటర్ ,కూలీలా ,మెయింటన్స్ ,వరిపొట్టు
*స్థలం (షెడ్) ఎంపిక విధానం:-
1.ముందుగా కోళ్ల పెంపకం సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, భవి ష్యత్‌లో పరిశ్రమ విస్తరణను బట్టి స్థల(షెడ్) ఎంపిక చేసుకోవాలి
2.ఫారానికి చుట్టుపక్కల ఉన్న స్థలం కంటే కొంచెం ఎత్తు, ఇతర కోళ్ల ఫారాల నుంచి 3-5 కిలోమీటర్ల దూరంలో ఉండే విధంగా స్థలాన్ని చూసుకోవాలి. ఎత్తై స్థలంలో ఫారాన్ని నిర్మించడం వల్ల వర్షాకాలంలో నీరు చుట్టుపక్కల నిల్వలేకుండా ఉండి గాలి, వెలుతురు లభిస్తాయి.
3.నేల కాంక్రీటుతో నిర్మించినదైతే ఎలుకలు మొదలైన వాటి నుంచి రక్షణగా ఉంటుంది.
*ప్రవేటు కంపెనీలు:-
1.vencobb
2. సుగుణ
3. వెంకటేశ్వర హేచరీస్ లిమిటెడ్
4. పయనీర్
5. బ్రోమార్క్
మెదలగు ప్రవేటు కంపెనీలు కోళ్ళ రైతులతో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాయి.
*కోళ్ల జాతుల రకాలు :-
1.బ్రాయిలర్ కోళ్లలో వెంకాబ్, హబ్బర్డ్, సామ్రాట్, కారిబ్ వంటి రకాలు ఉంటాయి
*కోళ్లు వచ్చే ముందు బ్రూడింగ్ ఏర్పాటు చేయాలి:-
1.కోడిపిల్లలు వచ్చే ముందుగానే బ్రూడింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలి
2.బ్రూడింగ్ అన గా కృత్రిమంగా వేడిని కల్పించడం. పిల్లలను తెచ్చిన వెంటనే నీటిని తాగించి బ్రూడర్‌లో వదిలిపెట్టాలి. వెచ్చని ఉష్ణోగ్రత కోసం సాధారణంగా విద్యుత్‌ను వినియోగిస్తారు. బ్రూడింగ్ అనేది సాధారణంగా బ్రాయిలర్, లేయర్ పిల్లలకు డీప్‌లిట్టర్ పద్ధతిలోనే ఏర్పాటు చేయాలి
*కోళ్ల కి దాణా:-
1.బాయిలర్ కోళ్ల పోషణలో మొదటి 4 వారాల వయస్సు వచ్చేవరకు చిన్న పిల్లలకు 22 శాతం మాంసకృత్తులు, 2900 కిలో కెలరీల శక్తి అవసరం
2.5, 6 వారాల వయస్సు గల వాటికి 20 శాతం మాంసకృత్తులు, 3000 కిలో కెలరీల శక్తి అవసరం.
*కోళ్ల కి నీరు:-
1.కోళ్లు సాధారణంగా అవి తిన్న దాణాకు రెట్టిం పు నీటిని తాగుతాయి
2.అందించే నీరు పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉండాలి
*మార్కెటింగ్:-
1.కోళ్ళు 6 నుండి 8 వారాల వయస్సు కి వచ్చినపుడు ఒకటిన్నర నుండి రెండు కి.గ్రా. బరువు ఉంటుంది అలా కరెక్టుగా వెయిట్ ఉంటే మీకు ఏ కంపెనీ లీజు ఇచ్చారో వాలు వచ్చి కోళ్లను తీసుకోని వెళుతార్
2. కోడిపిల్లలను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు దెబ్బలు తగలకుండా మేత, నీరు తొలగించాలి.
గమనిక :-
1.పౌల్ట్రీ రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో బయో రక్షణ అనేది కీలక అంశం. దీనిపై కూడా దృష్టి సారించాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు

Comments
Post a Comment