టమాటా వల్ల కలిగే ప్రయోజనాలు:-
హాయ్ ఫ్రెండ్స్ మనము చూసే కూరగాయలలో టంమోటో ఎంత ముఖ్యమో అందరికి తెలుసు టమోటో లేని కూర మనమూ తినలేము టమాటో వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి టమాటాలను సూపర్ ఫుడ్ అంటారు. వాటిలో ఎన్నో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉంటాయి. ఈ ప్రపంచంలో 2500 వేల రకాల టమాటాలున్నాయి. టమాటాల్లో కాన్సర్‌ను అడ్డుకునే గుణాలున్నాయి. వాటిలో ఉండే లైకోపీన్... కొలన్, ప్రొస్టేట్, లంగ్ కాన్సర్లను అడ్డుకుంటోంది.టమాటా కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
టమాటా వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు:-
1.టమాటాల్లో కాన్సర్‌ను అడ్డుకునే గుణాలున్నాయి. వాటిలో ఉండే లైకోపీన్... కొలన్, ప్రొస్టేట్, లంగ్ కాన్సర్లను అడ్డుకుంటోంది.
2.రక్తం గడ్డ కడితే మంచిదే. అతిగా గడ్డ కట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అలా జరిగితే, గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలా జరగకూడదంటే టమాటాలు తినాలి
3. మతిమరపు, డిప్రెషన్, టెన్షన్ వంటివి కలిగి ఉండేవారు టమాటాలు తినాలి. వాటిలోని బి, ఇ విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
4. టమాటాల్లో బీటా కెరోటిన్, లైకోపీన్... కళ్లకు మేలు చేస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి.
5. చర్మం కోమలంగా ఉండాలంటే టమాటాలు తినాలి. వాటిలోని బయోటిన్, విటమిన్ సీ ప్రోటీన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తాయి. చర్మ కణాల్ని రిపేర్ చేస్తాయి. ముసలితనం రాకుండా కాపాడతాయి.
6. ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్ని టమాటాలు తింటే అంత మంచిది. పుట్టే పిల్లలు అత్యంత ఆరోగ్యంగా, ఎలాంటి సమస్యలూ లేకుండా పుడతారు.ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉపయోగాలు వున్నాయి
అలాంటి టమాటో ఎలా పండిస్తారో మీకు తెలుసా తెల్సుకోవాలి అంటె vjyreview.blogspot.com వెబ్సైటు లో పేటె వీడియోస్ ని చుడండి

Comments
Post a Comment