Skip to main content

TURKEY FARMING IN INDIA(టర్కీ కోళ్ల పెంపకం)

  టర్కీ  కోళ్ల పెంపకం :- భారతదేశంలో టర్కీల జాతులు:- 1. బ్రాడ్ బ్రెస్ట్ కాంస్య *ప్రాథమిక ఈకలు రంగు నలుపు మరియు కాంస్య కాదు. ఆడవారికి తెల్లటి చిట్కాలతో నల్లటి  ఈకలు ఉంటాయి * ఇవి 12 వారాల వయస్సులోనే లింగ నిర్ధారణలో సహాయపడతాయి. 2.beltsville చిన్న తెలుపు *ఇది రంగు మరియు ఆకారంలో బోర్డ్ బ్రెస్ట్ వైట్‌ను పోలి ఉంటుంది కానీ పరిమాణంలో చిన్నది. గుడ్డు ఉత్పత్తి, సంతానోత్పత్తి మరియు పొదిగే అవకాశం ఉంటుంది. రైతు పేరు -ప్రమోద్ రెడ్డి చిరునామా - మునుగోడు మండలం చల్మెడ గ్రామం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర  మొబైల్ నెంబర్ -9391253627 3. బ్రాడ్ బ్రెస్ట్ వైట్ ఇది బోర్డ్ బ్రెస్ట్డ్ కాంస్య మరియు తెల్లటి ఈకలతో కూడిన వైట్ హాలండ్ మధ్య క్రాస్. తెల్లటి ప్లూమేజ్ టర్కీలు భారతీయ-వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనవిగా అనిపిస్తాయి ఇవి మంచి వేడిని తట్టుకోగలవు మరియు డ్రెస్సింగ్ తర్వాత మంచిగా మరియు శుభ్రంగా కనిపిస్తాయి. 4. నందనం టర్కీ:- ఇ  రకం బ్లాక్ దేశీ రకం మరియు అన్యదేశ బెల్ట్స్‌విల్లే చిన్న తెలుపు రకం మధ్య సంకలనం.  ఇవి తమిళనాడు వాతావరణ పరిస్థితులకు అనుకూలం టర్కీలను ఫ్రీ రేం...

Groundnut(వేరుశెనగ) crop information in telugu

వేరుశెనగ యొక్క ప్రయోజనాలు మరియు సాగు విధానం :-

హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మందికి ఇష్టమైనవి గింజలలో వేరు శనగ గింజలు. మనం వాటిని వేంపుకొని మరియు ఉడకబెట్టుకొని, స్నాక్స్‌లో, స్వీట్స్‌లో ,పల్లి చట్నీ,బెల్లం పట్టి   ఇలా రకరకాలుగా తింటాం. వేరు శనగల్లో ఎక్కువగా ఉండే విటమిన్ ఇ, ఫైబర్, సిలీనియం జింక్ వుండడము వల్ల శరీర సౌందర్యానికి కావలసిన హార్మోన్ల ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. రక్త ప్రసరణను మెరుగు చేసి మంచి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి ఉపకరిస్తాయి.  ఇంకా  మనకు తెలియని విషయం  ఏంటంటే మనం వేరు శనగ గింజల్ని తింటున్నాంగానీ... ఆ గింజలపై ఉండే సన్నటి తోలు (తొక్క,పోటు  ) తీసేసాం  . ఎందుకంటే అది మన నోటికి కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి తినం కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం వేరు శనగల్ని తొక్కలతో(పొటు ) సహా తినమంటున్నారు.దీని బట్టి వేరుశనగ పొటు కూడా ఉపయోగము  అన్న మాట  ఇంకా  ప్రోటీన్, ఆయిల్ మరియు ఫైబర్ వేరుశనగ లో చాలా అధికంగా ఉంటాయి.

* తొక్కల్లో ఉండే పాలీఫెనాల్ రకం  బాడీలో కలిసిపోయి చర్మాన్ని కాపాడములో సాయపడుతుంది మరియు  చర్మం ఎండిపోకుండా చేస్తుంది. వేరుశనగ తొక్కల్లో కూడా గుండె జబ్బులు, కాన్సర్, హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకునే గుణాలున్నాయి.తొక్కల్లో ఎక్కువగా ఉండే బయోయాక్టివ్స్  వలన  ఫైబర్  సంబందించిన  వ్యాధులు రాకుండా కాపాడతాయి.

*పరిశోధనలు ప్రకారం వేరుశనగల్ని పచ్చిగా గానీ, వేపి గానీ, ఉడకబెట్టి గానీ ఎలా తిన్నా... వాటి తొక్కలతో సహా తినేయాలి. రోజూ ఓ చేతి  గుప్పెడు వేరుశనగల్ని (తొక్కతో సహా) తింటే... బోలెడంత ఆరోగ్యం మనది అవుతుంది . భయంకరమైన కాన్సర్, గుండె జబ్బుల నుంచీ మనల్ని మనం కాపాడుకోవచ్చు అని కొన్ని అధ్యనాయాలు చెపుతున్నాయి 

వేరుశెనగ వల్ల కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు :-

బరువు తగ్గుట కోసం: వేరుశెనగలు  అనేవి అధికంగా ఫైబర్స్ కలిగి ఉండడము వల , ఇది ఒక్క  నమదగిన ఆరోగ్యకరమైన ఒక చిరుతిండి. వేరుశెనగలో  అధికంగా ఆహార ప్రోటీన్లను కలిగి ఉంటాయి మరియు  ప్రోటీన్లు మీ శరీరం యొక్క కండరాల శక్తిని పెంచుటలో మరింత నాజూకుగా ఉండేలా సహాయపడతాయి.మీరు అతిగా వేరుశెనగ  గింజలను తీసుకొనేటప్పుడు మీ బరువు పెరుగుతుందనేది ఒక సాధారణ దురభిప్రాయం వేరుశెనగ  గింజలలో ఉన్న అధిక కొవ్వు పదార్థం ఈ దురభిప్రాయానికి కారణం అవుతుంది. ఇది నిజం కాదు అని కొన్ని  అధ్యయనాలు వెల్లడించాయి మరియు కొన్ని సందర్భాల్లో, వేరుశెనగ వంటి గింజలతో సహా ఆరోగ్యకరమైన రీతిలో బరువును తగ్గించడంలో మీకు ఉపయోగం  పడుతాయి . 

చర్మం కోసం: వేరుశెనగ మీ చర్మాన్ని సున్నితంగా ఉంచడానికి మరియు గాయాలను నయం చేయుటలో సహాయపడతాయి.

కొలెస్టరాల్ కోసం: వేరుశెనగలు తినడం వల్ల కొలెస్టరాల్ పెంచుతూ ను తగ్గించుటలో సహాయపడతాయి, ఇది ఒక మంచి రకపు కొలెస్ట్రాల్. భోజనం తర్వాత తక్షణమే కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో కూడా అవి సహాయపడతాయి మరియు శరీరంలో LDL,hdl  కొలెస్టరాల్ని తగ్గించడంలో వేరుశెనగ సహాయపడతాయని, ఒక క్లినికల్ అధ్యయనంలో, వేరుశెనగ వినియోగం వలన 4 వారాలలో కొలెస్ట్రాల్ స్థాయిలు సమతుల్యం చేయబడినట్లు కనుగొనబడింది

గుండె కోసం: వేరుశెనగ  అనునది కొలెస్ట్రాల్ తగ్గించడం వలన మరియు విటమిన్ E కలిగి ఉండటం కారణంగా, వేరుశెనగ ఎథెరోస్క్లెరోసిస్, గుండెపోటు మరియు గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి.మీ గుండెకు అవసరమైన ఆరోగ్యకరమైన పోషకాలు వేరుశెనగ లో  కలిగి ఉంటుంది.అంతేకాకుండా  రక్త నాళాలలో ఫ్లేక్ వృద్ధి వంటి ప్రమాదాన్ని తగ్గించడంలో లిపిడ్ ప్రొఫైల్స్ కలిగి ఉంటుంది కొన్ని అధ్యనాయాలు ప్రకారం వేరుశెనగలో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి  విటమిన్ ఇ అధిక మొత్తంలో కలిగి ఉన్నట్లు కనుగొనబడిoది.వేరుశెనగలో లభించే అమైనో ఆమ్లం అర్జినైన్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు ఆరోగ్యకరమైన గుండె రక్త సరఫరా వ్యవస్థకు చిహ్నంగా ఉంటుంది.

అల్జీమర్స్ వ్యాధి చికిత్స కోసం వేరుశెనగలు   :-

అల్జీమర్స్ అనేది ఒక న్యూరోడీజనరేటివ్ కి సంధించిన వ్యాధి,ఇది  నెమ్మదిగా మెదడు యొక్క పనితీరు మరియు ప్రేరక చర్యలను తగ్గిస్తుంది. ఎన్ ఐ హెచ్ ప్రకారం, ఇది వయస్సు సంబంధిత చిత్తవైకల్యం మరియు గ్రహణ శక్తి యొక్క కోల్పోవుటకు  కారణం. ఈ వ్యాధికి ఖచ్చితమైన నివారణ లేదు, చికిత్స సాధారణంగా గ్రహణ శక్తి యొక్క చికిత్సలు మరియు ప్రవర్తన నిర్వహణ వ్యక్తుల సాధారణ జీవితాన్ని పొందడానికి వేరుశెనగలు సహాయపడతాయి. విటమిన్  మరియు విటమిన్ B3 సమృద్ధిగా కలిగి ఉండటం వలన   అల్జీమర్స్  వ్యాధితో బాధపడుతున్న మిమ్మల్ని రక్షించడంలో వేరుశెనగ సహాయపడుతుంది.  అల్జీమర్స్ కు వ్యతిరేకంగా కొంత చికిత్సా సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అని కొన్ని అధ్యనాలు తెలుపుతున్నాయి 

మానసిక ఆరోగ్యానికి: వేరుశెనగ తినడం  వలన వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్లు యొక్క గొప్ప కూర్పు కారణంగా డిప్రెషన్, ఆందోళను తగిస్తాయ్  మరియు అల్జీమర్స్ వ్యాధి సంభవాన్ని కూడా తగ్గిస్తాయి.

పిత్తాశయ రాళ్ళ చికిత్స కోసం: వేరుశెనగలు రోజు తినడం వల్ల పైత్య ఆమ్లాల ఉత్పత్తిలో సహాయపడతాయి దీని  వలన పిత్తాశయ రాళ్ళను నివారించడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ వ్యాధికి వ్యతిరేకంగా:

వేరుశెనగలు  తినడం  వలన ప్రత్యేకంగా కడుపులో కలిగే క్యాన్సర్ యొక్క ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

వేరుశెనగ వల్ల ఉపయోగాలు:-

*వేరుశనగ యొక్క విత్తనాల నుంచి లభించే వేరుశెనగ నూనె ని  వంటకాలలో ఉపయోగిస్తారు మరియు దీని నుంచి డాల్డా లేదా వనస్పతిని రకము తయారుచేస్తారు. ఈ నూనెలను సబ్బులు, సౌందర్యపోషకాలు, కందెనలుగా వాడతారు.

*వేరుశనగ విత్తనాలు బలమైన ఆహారం. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి అని తెలుసు 

*అంతేకాకుండా నూనె తీయగా మిగిలిని పిండిని ఎరువుగా, పశువులకు, కోళ్ళకు దాణాగా వాడతారు.

వేరుశనగ సాగు విధానం :


CONTAC NUMBER:-9849611083

నేల రకాలు ఎంపిక:-

వేరుశనగ పంట  సాగులో నేలలు ఎన్నుకోవడం అనేది అతి ముఖ్యమైన పని. వేరుశనగ పంటకు అనువైన నేలలు

 *ఇసుక ఎర్ర నేలలు ,

 *ఇసుకతో కూడిన గరప నేలలు 

*చల్కా మరియు ఎర్ర గరప నేలలు

వేరుశనగ పంట కి  ఇసుక శాతం ఎక్కువ ఉండి తేమ శాతం తక్కువగా ఉండే నేలలు చాలా అనువైనది మరియూ  బంక మరియు జిగురు నేలలు వేరుశనగ పంట సాగుకు పనికిరావు , మురుగునీటి పారుదల సరిగ్గా లేని నేలలు కూడా వేరుశనగ పంట సాగు పనికిరావు.

ముఖ్యముగా మన తెలుగు ప్రాంతాలలో వర్షపాతం 40 నుండి 110 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది కాబట్టి ఈ వాతావరణం మనకు చాలా అనువైనది 

వేరుశనగ పంటల కు అవసరమైన ఉష్ణోగ్రతలు :-

*వేరుశనగ పంటకు  పెరుగుదల దశలో 26 నుండి 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ల ఉష్ణోగ్రత  మరియు కాయల యొక్క పెరుగుదల దశలో 23 నుండి 26 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే పంట పెరుగుదలకు మంచిది.

నేలా చదును :

వేరుశనగ పంట విత్తిన గింజలు సులువుగా మొలకెత్తడానికి  మరియు కలుపు(పిచ్చిమొక్కలు ) మొక్కలు ఉధృతి తగ్గించుటకు నేలని  సుమారుగా 10 నుండి 16 సెంటీమీటర్ల లోతు వరకు ట్రాక్టర్ నాగలి తో  మెత్తగా  దున్ని ఎత్తుపల్లాలు లేకుండా చదునుగా చేసుకోవలెను.ఎక్కువ లోతు దున్నితే పంట కోసేప్పుడు కష్టతరంగా మారుతుంది. అలగే మొక్క ఎక్కువగా పెరుగుతుంది. కాయలు భూమి లోతులో కాస్తాయి. కావున 10 – 16 సెంటిమీటర్ల లోతు వరకు సరిపోతుంది. 



వేరుశనగ పంట సాగుకు విత్తనాలు  ఎంపిక:-

ఒక్కో ఒక  ప్రాంతానికి ఒక్కో  విధమైన వాతావరణ పరిస్థితులు కలిగి ఉంటాయి కావున ఆయా ప్రాంతాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న వేరుశనగ విత్తనా రకాలను వ్యవసాయ అధికారులు సలహా ఎంపిక చేసుకోవడం మంచిది. రబీలో నీటి వసతి కి  ఐసిజిఎస్-91144, కదిరి-9,  ధరణి,కదిరి 6, టిఎజి-24, అనంత, హరితాంధ్ర ,నారాయణ వంటి వేరుశెనగ రకాలు అనుకూలమైన గా చెప్పవచ్చు.

విత్తనశుద్ధి

ముఖ్యముగా వితనాన్ని ఎంచుకునే విధానంలో మొదటగా వేరుశనగ గింజ పై పొర (పోటు ) దెబ్బతిన్న ఉన్న మరియు గింజ రంగు మారిన విత్తనాలను పూర్తిగా తొలగించాలి. వేరుశనగ పంట లో వచ్చే వివిధ రకాల చీడపీడలను సమర్థవంతంగా ఎదుర్కొవాలి అంటే విత్తనశుద్ధి తప్పనిసరి చేయాలి . విత్తనాలు భూమి లో పేటె ముందు విత్తనశుద్ధికి కిలో విత్తనానికి 1గ్రా, కార్బండాజిమ్ లేదా 3 గ్రా. మ్యాంకోజెబ్తో తో విత్తనశుద్ధి చేసుకోవాలి. తేలిక పాటి నేలల్లో వేరు పురుగు సమస్య కూడా గమనించవచ్చు. అలాంటి ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ మరియు కాండం కుళ్ళు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాల్లో 1 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్. ను 8 మి.లీ. నీటిలో కలిపి ఒక కిలో విత్తనానికి పట్టించాలి. కొత్తగా వేరుశనగ సాగుచేసే ప్రాంతాల్లో ఎకరాకు సరిపద కిలో విత్తనానికి 180 గ్రా. రైజోబియం కల్చరుని పట్టించాలి. వేరు కుళ్ళు, మొదలు కుళ్ళు మరియు కాండం కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి 12 గ్రా. ట్రైకోడెర్మా విరిడెతో విత్తనశుద్ధి చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.విత్తనశుద్ధి చేసేటప్పుడు ముందుగా పురుగు మందును కలపాలి. ఆ తర్వాత విత్తనాల్ని ఆరబెట్టి, శిలీంద్ర నాశక మందుల్ని పట్టించాలి.విత్తనం విత్తుకున్నకా ఎలుకలు, ఉడతలు మరియు పక్షులు చెలక నుండి వేరు చేస్తాయి. అలాంటప్పుడు చేనులో కిరోసిన్, పినెటార్ మరియు ఎండకి మెరిసే కవర్లను ఉంచడం మంచిది. 

గమనిక :-వితనాన్ని ఎంచుకునే విధానం మరియు విత్తనశుద్ధి వంటి  విషయాలని  వ్యవసాయ అధికారులు సలహా తీసుకోవలచినది కోరుచున్నాము 

వేరుశనగ పంట వేసే  సమయం:-

*తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులు మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారం లేదా  జూలై నెల వరకు వేరుశనగ విత్తనాలు వేసుకోవచ్చు

నీటిపారుదల సమయము  :-

* రైతులు  ముఖ్యముగా వేరుశనగ పంట ని  వర్షాకాలం మొదలు కాకముందే ఎక్కువ వేస్తారు కావున  మొదటిసారిగా ఒక రో జికి  1 లేదా రెండు సార్లు నీరు పేటె అవసరం ఉంటుంది . ఒక్కవేళ నీరు  అందుబాటులో లేకున్నా జూన్ లో  ఋతుపవనాలు ప్రవేశించే సమయం కాబట్టి నీటి వినియోగం అంతగా ఉండకపోవచ్చు. నీటిపారుదల అందుబాటులో ఉంటె ఉపయోగించుకోండి.  

*పువ్వు పూసే సమయంలో నీటి అవసరం ఎక్కువ కావున పంటకి కనీసం 7-10 రోజులకి ఒక్కసారి నీరు పెట్టాలి . ఇక  వేసవి సమయంలో అయితే 6-8  రోజులకి ఒక్కసారి అయినా నీరు అందించాలి.

కలుపు యాజమాన్యం పద్ధతి :-

వేరుశెనగ పంట  లో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది మొక్కలు పంటకు పోటి రావడం వల్ల చేను ఎదుగుదల కష్టతరంగా మారుతుంది. ఈ కలుపు మొక్కల ని  పంట సమయంలో 30 నుండి 40 రోజుల మద్య కలుపు ఏరివేత చేపట్టాలి. 70 రోజుల వరకు పంటలో కలుపు మొక్కలను పూర్తిగా తొలగించాలి. ప్రసుత కాలములో కలుపూ  నివారించేందుకు పిచికారీ మందులు వచ్చాయి 

చీడపీడల మరియు తెగుళ్ల :-

వేరు పురుగు:,ఆకు ముడత పురుగు,పొగాకు లద్దె పురుగు,తామర పురుగులు,పేనుబంక పురుగు,తిక్కాకుమచ్చ తెగులు,మొదలు కుళ్ళు తెగులు,కాండము కుళ్ళు తెగులు,మొవ్వు కుళ్ళు వైరస్ తెగులు,కాండం కుళ్ళు వైరస్

వేరుశనగ పంట సాగు లో సూక్ష్మ పోషకాల లోపం :-

జింకు,గంధకము,ఇనుము,కాల్షియం,మాంగనీసు వంటి పోషక లోపాలు వచ్చినపుడు  వ్యవసాయ అధికారులు సలహా తీసుకోవలచినది కోరుచున్నాము 

వేరుశెనగ పంట కోత సమయము  :- చివరిగా వేరుశనగ పంట కోత అనేది వేరుశెనగ రకాలను బట్టి 120 నుండి 130 రోజులు కోతకు వస్తుంది. ఒక మొక్కని భూమి నుండి తీసి చూడాలి ,వేరుశనగ పంట కోత సమయంలో 60 నుండి 70 శాతం మొక్కల కొమ్మలు ,ఆకులు పసుపు వర్ణం గా మారుతాయి. కాయల డొల్ల లోపలి భాగము నలుపుగా మారినప్పుడు కోయాలి . కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవడము మంచిది 

గమనిక :మా vjyreview అనేది వేరుశెనగ పంట రైతుల యొక్క అభిప్రాయాలూ తెల్సుకోని మీకు తెలియజేస్తున్నాము మీరు ఎవరు ఐనా వేరుశెనగ పంట పెట్టాలనుకుంటే మీ దగ్గర లో ఉన్న అగ్రికల్టెర్ ఆఫీసర్ యొక్క సలహాలు తీసుకోన తరువాత వేరుశెనగ పంట గలరని మా యొక్క అభిప్రాయము


Comments

Popular Posts

vegetable’s

Vegetables farming vegetables Tomato Onion Chilli Brinjal Lady’s finger Other Tomato 〈 〈 Hi friends everyone knows how important tomato is in the vegetables we see We can not eat curry without tomato Tomato has many uses Tomatoes are called super food. They contain many antioxidants and vitamins. There are 2500 thousand varieties of tomatoes in this world.  That being said there are many uses for what you need to know if you know how to grow such antomato   i.e. watch  videos on  vjyreview.blogspot.com  website Let's find out what are the benefits of using them:- 1 Tomato has anti-cancer properties. The lycopene in them ... prevents colon, prostate and lung cancers. 2. It is better to cut a blood clot. There is also a risk of freezing. If that happens, there is a risk of heart attack. To prevent that from happening you should eat tomatoes 3. People with forgetful...

Animals farming

Animals farming Hashtag Links with Margin Poultry Chicken Fish Sheep Goat Buffalo Pig Poultry Chicken 〈 〈 Hi friends nowadays if any relatives come it is mandatory to bring chicken meat it is such chickens reared in our india are being reared in different varieties in our india. Needless to say, the importance of agriculture in the country. Still, it will always be in the first place. But now, along with food production, poultry is also gradually gaining importance. Looking at the last four and a half decades ... the Indian poultry sector has changed a lot. The older generation came from poultry farming to sophisticated methods. As many as 40 lakh people are employed in this sector. Moreover, the entire business is worth Rs. 50,000 crore. Currently, 38 per cent of the country's production comes from rural and hilly areas. 1. After the construction of the shed, the farmers supply the contract to t...

FRUITIES,WOOD TREES

FRUITIES,WOOD TREES Hashtag Links with Margin Mango banana dragon guva water melon,pomegranate,grapes,other teak,Red Sandalwood,srigandha other Mango 〈 〈 What are the benefits of eating mango fruit: - Hi friends, the summer season has come, which means that we remember that mango fruit is loved by children and adults alike. Mango fruit has a history of four thousand years. Mango leaves are tied to our house when there is any work or festival, this is the national fruit of India, its nuts are used in making greens, it contains carotene, vitamin C, calcium, its leaves are also called "chuta patri" this tree grows as a big tree. There are more than a hundred varieties of mangoes in India. First let us know the benefits of eating mangoes and then how to grow a mango garden. If you know these health benefits of mangoes, you won't be left out at all:- 1.Potassium and magnesium present in...