నాలుగు గుంటల భూమిలో పొట్టేలు, మేకలు ,నాటు కోళ్లు మరియు బాతుల పెంపకం(Raising four types of organisms)
మారుతున్న కాలం బట్టి స్వయం ఉపాధి విషయంలో వినూత్న ఆలోచనలతో ముందుకెళుతున్నారు
ఈ ఆలోచనలలో ఒకటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం
నాలుగు గుంటల భూమిలో షెడ్డు నిర్మించి అందులో కోళ్లను మరియు పొట్టేలను మేకలను టర్కీ కోళ్లను బాతులను పెంచుతున్నారు
ముందుగా పొట్టేలు మరియు మేకల గురించి తెలుసుకుందాం. ఈ షెడ్డులో 20 పొట్టేలు మరియు 20 మేకలు ఉన్నాయి
ఒక్కొక్క పొట్టేలును 5000 రూపాయలకు తెచ్చి వాటిని ఆరు నెలలు పోషించి డబుల్ రేటు గాని మరియు ఎక్కువ రేటు గాని అమ్ముతారు మళ్ళీ ఈ 20 పొట్టేలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక జత 20 పొట్టేలు తెచ్చి మళ్ళీ ఆరు నెలలు మళ్లీ పోషించి అమ్మడం జరుగుతుంది
ఇదే విధంగా మేకలను కూడా పోషించడం జరుగుతుంది
రైతు పేరు -ప్రమోద్
చిరునామా -మునుగోడు గ్రామం మునుగోడు మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర0
మొబైల్ నెంబర్ -9640525757
వీటి ఆహారము కోసం అతను రెండు ఎకరాలలో గడ్డిని వేయడం జరిగింది ఈ గడ్డిని సాయంత్రం పూట ముక్కలు ముక్కలుగా చేసి వాటికి పెట్టడం జరుగుతుంది మరియు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నీటిని తాపడం జరుగుతుంది
ప్రమాద0-
1.పొట్టేళ్లకు రోగనిరోధనా శక్తి చాలా తక్కువ కావున వాటిని ప్రతిరోజు వాటిని పరిశీలన చేయాలి 2.మేకల విషయములు అంతగా ప్రమాదం ఉండదు కానీ అయినా మనము ప్రతిరోజు పరిశీలన చేయాలి
నాటు కోళ్లు ,బాతులు మరియు టర్కీ కోళ్లు పెంపకం-
1.నాటు కోళ్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నది ఎందుకంటే నాటు కోళ్ల కి ఎలాంటి వ్యాక్సిన్ లను వెయ్యరు తినడం వలన ఎలాంటి వ్యాధులు రావు
2. నాటు కోళ్ల కి బాయిలర్ కోడి కన్నా వాటికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కానీ వాటికి ఆహారం నూకలు కానీ వడ్లు కానీ బియ్యం గాని వేస్తారు ఇలా వేయడం వలన అవి పోషకాలు అంది అవి బలంగా ఉంటాయి. మరియు వాటిని ఆ బహిరంగ ప్రదేశంలో విడిచిపెట్టడం వలన ఆ గడ్డిలోని పురుగులని వాటిని తిని అవి పౌష్టికంగా బలంగా తయారవుతాయి కావున వాటికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది
3. వీటి లాగానే లాగానే బాతులకు టర్కీ కోళ్లకు డిమాండ్ ఉంటది మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియోని క్లిక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము



Comments
Post a Comment